Sunday, July 12, 2020

25 years enough for me to know the stupid world

చదువు, దైవం, రాజకీయం, యుద్ధం, మీడియా , కోర్టులు, న్యాస్థానాలు, పోలీస్, స్వార్థం, ప్రేమ, సలహాలు , మతం, గతం, భవిష్యత్, మంత్రం, జాతకం, నమ్మకం, విశ్వం , సినిమా , ఆనందం, ప్రభుత్వం పని తీరు, మద్యం , అలవాటు, డ్రగ్స్, పదవి, తాయిలాలు ప్రజాస్వామ్యం, రాచరికం, అర్థ ప్రజాస్వామ్యం, సైనికుడు, రైతు , ఉద్యోగి , మహిళా , బాల్యం, యవ్వనం, ముసలితనం, వ్యక్తిత్వం, మూర్ఖత్వం, ఆత్మరక్షణ, విమర్శ, పరిపూర్ణత (పశ్చాత్తాపం ), వైద్యం, రోగాలు, వెలుతురు, చీకటి, శవం, ఆత్మ, వేశ్య , దళితుడు , బ్రాహ్మణుడు, విజయం, స్థిరపడ్డారు (ఉద్యోగం), 
నేను టాక్స్ ఎందుకు కట్టాలి , 

Source book (25 years enough for me to know the stupid world)
written by : Purushtham.s

ఎదో కనిపించని శక్తి ఈ భూ ప్రపంచాన్ని నడిపిస్తున్నది అని నమ్మే నేను దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటానే గాని  దాని గురించి భయపడలేదు ఎందుకంటే అది మన చేతిలో లేదు, కానీ ఈ భూమి మీద  కనిపించే ఎన్నో శక్తు లు మనిషి ని ప్రభావితం చేస్తున్నాయి అవే నన్ను ఈ పుస్తకం రాయడానికి ప్రభావితం చేసాయి. 

ఈ విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది . కనిపించే ఏ ఆధారం లేకుండా ఉన్న భూమి నిజం కావున మన జీవితంలో నమ్మలేని నిజాలు ఏవి లేవు అన్నీ నమ్మదగ్గవే


 శాంతి 

ప్రపంచంలో అందరు కోరుకునేది ఎవరు పాటించనిది శాంతి.  నేను చూసినంతలో నాకు తెలిసినంతలో చివరి వరకు శాంతి అని నిలబడింది ఒక్క మహాత్మా గాంధీ నే అనుభవం వల్లనో వ్యక్తిత్వం వల్లనో అయన చివరి వరకు శాంతస్వభావం తోనే ఉన్నారు త్యాగమూ చేసారు . అనుభవం అని ఎందుకన్నానంటే మనిషి వ్యక్తీకరించే భావాలలో క్లిష్టమైంది శాంతియుతంగా ఉండటమే అది తప్పనిసరిగా అనుభవం, వయసు తో మాత్రమే వస్తుంది. ఎన్ని యుగాలు చూసిన ఎంత దైవం చూసిన రక్షణ, శిక్షణ ఉన్నాయి కనుక క్షమించటం త్యాగం చేయటం అంత సులభం కాదు. 

సృష్టి మూల సిద్ధాంతం బ్రతకటం అయినప్పుడు పాము కప్పను మ్రింగటం తప్పదు, ఆ పోరాటం లో మనం శాంతి ని ఏ విధంగా నూ కోరుకోలేము మనిషి విషయంలో కులాల మధ్య ,మతాల మధ్య ,జాతుల మధ్య, ప్రాంతాల మధ్య , చివరికి అన్న తమ్ముళ్ల మధ్య వచ్చే పోరాటాలు అలాంటివే, కానీ ఆయా అవసరాలని బట్టి శాంతియుతంగా ఉండొచ్చు కానీ శాంతి స్థాపన అసాధ్యం. 

విడిపించుకోవాలనే కప్పు ప్రయత్నం, వదలని పాము గుణం .... అణగారిన వర్గాల దోపిడీ దారుల పోరాటమే స్వేచ్చ కోసం ఒకరు ఆధిపత్యం కోసం ఒకరు పోరాడుతూనే ఉంటారు అది  రూపం మార్చుకుంటుంది కానీ అంతం అవ్వదు. కురుకేత్రం అయినా, స్వతంత్ర పోరాటాలైనా,  మొదటి రెండవ ప్రపంచ యుద్దాలైన ఇప్పుడు చైనా దురాక్రమణలైనా, జాతి వివక్ష దాడులైనా అన్నింటి అర్థం ఒక్కటే. 




విశ్వం 

అనంత విశ్వం లో అర్థం కానీ విషయాలు ఎన్నో అందుకే నేను అన్నాను ముందు గానే కనిపించే ఏ ఆధారం లేకుండా భూమి తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది అన్నది నిజం కావున ఈ ప్రపంచం లో నమ్మ లేని నిజాలు ఏవి లేవు అన్నీ నమ్మ దగ్గవే. 
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విస్పోటం చెంది బ్రహ్మపదార్థం ద్వారా ఏర్పడిన విశ్వం సూర్యుడి కేంద్రంగా నవగ్రహాలు పరిబ్రమిస్తున్నాయి. నవగ్రహాలలో మూడవది భూమి దీని ఉపగ్రహం చంద్రుడు. 

గుండ్రంగా ఉన్న భూమి అనే బంతి మీద పడుకొని సూర్యుణ్ణి చూస్తే పగలు అని చంద్రుణ్ణి చూస్తే రాత్రి అని పిలుచుకుంటాం. చంద్రుడి తో పాటు వేల నక్షత్రాల్ని చూడగలం. ఇలాంటి సౌర వ్యవస్థ లు మరికొన్ని ఉండే అవకాశం చాలా ఉంది కేవలం మనకు తెలియదంతే. 
జీవం ఉన్నది భూమి మీద మాత్రమేనా అవును అంటున్నారు పరిశోధించిన శాత్రవేత్తలు కానీ నా అభిప్రాయం జీవం భూమి మీద మాత్రమే కాకుండా  ఇతర గ్రహాల మీద ఇతర సౌర వ్యవస్థ ల మీద కూడా ఉందా, ఉండి మనకు వాటిని  చూసే శక్తి లేదేమో ఎందుకంటే ఇదే భూమి మీద మనిషి అత్యంత శక్తివంతుడు అయ్యి  ఉండవచ్చు కానీ మనిషి కి లేని చాలా సానుకూలతలు ఇతర జీవులకు ఉన్నాయి ఉదాహరణకు కుక్క ముందే పసిగట్ట గలదు, పాము కు చెవులు లేకపోయినా తరంగాల ద్వారా ఉనికిని గుర్తిచగలదు, గబ్బిలం చీకట్లో చూడగలదు, అందరికి తెలుసు పక్షి ఎగరగలదు .. కావున ఇతర గ్రహాల మీద ఇతర సౌర వ్యవస్థ ల మీద ఉన్న జీవాన్ని మనం గుర్తించలేకపోవచ్చు కదా. ఆ జీవి మనల్ని చూస్తుందేమో అని మనం ఎందుకు అనుకోకూడదు. 

ఇతర గ్రహాల మీద ఇతర సౌర వ్యవస్థ ల మీద జీవం అన్నప్పుడు నాకు మరొక్క సందేహం మనం సైన్స్ ల్యాబ్ లో మైక్రోస్కోప్ లో వేల బాక్టీరియా ని వైరస్ ని చూస్తాం మన ల్యాబ్ లో ఉన్నట్లు గాని మనం చూస్తున్నట్లు గాని వాటికీ తెలీదు అలాగే మనిషి, భూమి సౌర వ్యవస్థ లు వేరొక్కరి ల్యాబ్ లో వస్తువులు ఎందుకు కాకూడదు వాళ్ళు మనల్ని నడిపించుచున్నారేమో ( వారే మనం అనుకొనే శక్తి , దేవుడు ఏమో ) అదే నిజం ఐతే ఎంతమంది పరిశోధనలు చేస్తున్నారో ఎన్ని ల్యాబ్ లు ఉన్నాయో ఊహించటం కష్టం కానీ అబద్దం అని అనుకోలేం . 

జాతకం

కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్రహాలు తొమ్మిది అని తెలుసుకున్న మేధావులు జీవం సమయాన్నిపుట్టిన  బట్టి అప్పుడు గ్రహాలు ఉన్న స్థానాన్ని అంచనా వేస్తూ చెప్పే జాతకాన్ని ఎందుకు నమ్మకూడదు. జాతకం తప్పు ఐతే అతనికి తెలీదు అనుకోవాలి గాని జాతకమే తప్పు అనుకోవటం ఎందుకు. సూర్యుడు , గ్రహాలు పరిభ్రమణం  నిజం ఐనప్పుడు జాతకాన్ని ఎలా కొట్టిపారేస్తాం అనేది నా అభిప్రాయం మాత్రమే అలా అని ఇప్పుడు జాతకం చెప్పే వాళ్ళు అంతా నిజం అని నేను చెప్పను వాళ్లకు పూర్తిగా తెలీయక పోవచ్చు ఆ విజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాతకం అబద్దం అనుకునే వాళ్లలో నేను ఒకడ్ని కావున జాతకం పేరు చెప్పి రంగు రాళ్లు ఉంగరాలు అమ్మి మోసం చేసే వాళ్ళతో జాగ్రత్త గా ఉండటమే కాదు జాతకం నిజం అయ్యి ఉండొచ్చు కదా అని ఆ జ్ఞానం తెలుసుకోవటం కూడా ముఖ్యం. 

దైవం / దేవుడు 

దేవుడు అంటే ఆస్తిక వాదుల ప్రకారం మన కష్టాలు, బాధలు, చేసిన పాపాలు తీర్చేవాడు. నాస్తిక వాదులు దేవుడే లేడంటారు  ఉంటే ఎదో శక్తి ఉండొచ్చు అంటారు, ఆ శక్తి పేరే దేవుడు అంటారు ఆస్తిక వాదులు.  విశ్వం టాపిక్ లో మాట్లాడినట్లు భూమి సౌరవ్యవస్థ అంత ఒక ల్యాబ్ లో వస్తువైతే అది నడిపించేవాడు దేవుడు నాస్తిక వాదులు అనుకొనే శక్తి. ఈ సౌరవ్యవస్థ ఒక ల్యాబ్ లో వస్తువు కాదు అంటే తనకు తానుగా ప్రమాదవశాత్తు ఏర్పడ్డ ఒక ఘటన తరువాత తరువాత జీవం పుట్టుక పయనం భవిష్యత్ ఏ ఆధారం లేకుండా జరుగుతున్న సంఘటన అనుకోవచ్చు. 

సులభంగా చెప్పాలంటే ఒక వాహనాన్నీ వ్యక్తి నడుపుతున్నాడు అనుకుంటే ఆ వాహనానికి ఆ వ్యక్తి దేవుడు (శక్తి) అతను తలచుకొంటే ఆ వాహనాన్ని నాశనం చేయగలడు కావున అతన్ని ప్రార్థించటం వలన నాశనాన్ని (మనం చేసిన తప్పుని పాపాల్ని ) సరిదిద్దుకోవచ్చు  , లేదు ఆ వాహనం ప్రమాదవశాత్తు తనకు తానుగా నడుస్తోంది అంటే దేవుడు  లేడు అని ఆ వాహనాన్ని ఎవరు నడిపించుట లేదు, నడిచినంత కాలం తనకు తానుగా నడుస్తూ సమయం వచ్చినప్పుడు తనకు తానుగా పడిపోతుంది ఈ భూమి కూడా అంతే. 

ఇంకా లోతుగా ఆలోచిస్తే ఒక వ్యక్తి లేదా ఒక జీవి ప్రార్థిస్తే దేవుడు స్పందిస్తాడా ఆలా ఎంతమందికి స్పందిస్తాడు అంత మంది సమస్యలు ఒకేసరి ఎలా వినగలడు అనేది మనం ఆలోచించాలి కావున చెప్పేది ఏంటంటే దేవుడు అనుకొనే శక్తి మనల్ని నడిపించొచ్చు (ఏమో ) కానీ మన సమస్యల్ని ఎట్టి పరిస్థితులలో తీర్చలేడు ఏ మతం లో ఐనా. అందుకే పిల్లలకు గుడ్డి గ చిన్నప్పటినుంచే దేవుడు దయ్యం అంటూ నూరి పోయకుండా తమకు తాముగా తెలుసుకొనే ప్రయత్నం చెయ్యనివ్వండి . అప్పుడే ఏదైనా కొత్తది కనుక్కొనే అవకాశం ఉంది. 



మతం 


హిందువులు శివుడు, బ్రహ్మ, విష్ణువు, వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, వేంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు ( ఇంకా చాలామంది ని ) మొదలగు వారిని దేవుళ్ళ గ పూజిస్తారు. 

క్రైస్తవులు జీసస్ ని దేవుడి గా కొలుస్తారు. 

మహమ్మదీయులు అల్లా దేవుడంటారు. 

బౌద్ధులు బుద్ధుని బోధనలు వింటారు. 

మనిషి కి దేవుడున్నాడేమో (కనిపించని శక్తి ) కానీ దేవుడికి మతం లేదు 

నువ్వు సోమవారం వేంకటేశ్వరుడిని పూజించు, శుక్రవారం అల్లా ని ప్రార్థించు, ఆదివారం ప్రశాంతంగా జీసస్ ని వేడుకో. తప్పులేదు అవి నీకు క్రమశిక్షణ నేర్పిస్తాయి, మతాలు నీకు ఎలాబ్రతకాలి అని నేర్పిస్తాయి కానీ దేవుణ్ణి చూపించవు నీ తప్పుల్ని క్షమించవు. అర్థరాత్రి లేదా ఉదయం ప్రశాంతమైన వాతావరణం లో నీలో నువ్వే మాట్లాడుకో నీ తప్పు నువ్వే తెలుసుకో నువ్వే పశ్చాత్తాపపడు వీలైతే సరిదిద్దుకో  కాకపోతే వదిలేయ్ అంతే కానీ తప్పులు చేసుకుంటూ పోతూ దేవుడు క్షమిస్తాడు అనుకోకు. 

జీవం పుట్టినప్పటి నుంచి  ఎన్నో పరిణామాలు అందులో మనిషి పక్క వాడిని బ్రతికించటానికే  ఈ మతాలు ఉదాహరణకి హిందూ మతం మనిషి తప్పు చెయ్యకుండా భయపడ్డానికి విగ్రహారాధన తరువాత తనకు మంచి చేసే వాటిని పూజించటం (వేప చెట్టుని తులసి చెట్టుని గోవు ని, గంగ నదిని, సూర్యుణ్ణి , భూమిని, నీటిని  పూజించటం వంటివి ) సద్గుణాలు కలిగిన రాముడిని , ధర్మం వైపు నిలబడ్డ కృష్ణుడిని పూజించటం ఎలా బ్రతకాలో చెప్పటానికే.

రామాయణ భారతాలు, భగవద్గీత  హిందువుల ప్రాణాలు అందులో మంచిని గ్రహించగలిగితే నీ జీవితంలో జరిగే ప్రతిదీ అందులో ఉంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అవి ఏ మతం వారికైనా ఉపయోగపడతాయి అలాగే క్రీస్తు జీవితం, ఖురాన్ గ్రంధాలు కూడా కావున దేవుడికి మతానికి సంభందం లేదు, మనిషి కి మతానికి మాత్రమే సంబంధం ఉంది మనిషి కి దేవుడికి ఎటువంటి సంబంధం లేదు 

మంత్రాలూ పాటించటం శక్తులు సంపాదించటం ఉదాహరణకి అనంత పద్మనాభ స్వామి దేవాలయం లో 6 వ గది కి వేసిన నాగబంధం అన్నది  జ్ఞానం, ఇప్పుడు అర్థం కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా గొప్ప మేధస్సు ఇప్పుడు మనం పిలువబడే సైన్స్ ఉంది 


ఒక చిన్న కథ 

ఒక గొర్రె ఆవేదనతో దేవుడి దగ్గర తన సమస్యలని ఇలా చెప్పుకుంది. దేవుడా అడవిలో పులులు సింహాలు చివరకు నక్కలు, ఇక్కడ మనుషులు నన్ను చంపి తింటారు మీరు చూస్తూ ఎందుకు ఊరికే ఉంటారు అని 

దానికి దేవుడు స్పందిస్తూ...  మొదట నన్ను దేవుడన్నారు తరువాత ఒక్కొక్క మతానికి ఒక దేవుడన్నారు ఆ తరువాత మా కులానికి మాత్రమే వేరే దేవుడు అన్నారు, కొన్ని కులాలను దేవుడు రానివ్వడు అన్నారు. ఈ మతం దేవుడిని ఆ మతం వారు, ఆ మతం దేవుడిని ఈ మతం వారు తిట్టటం మొదలు పెట్టారు అలాగే నాకోసం వారిలో వారే కొట్టుకు చస్తున్నారు, కొంతమంది తనకు తానే చచ్చిపోతున్నారు. కోరికలు కోరుకుంటారు తీర్చలేదని తిడుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా నన్నే నిందిస్తున్నావ్.  దేవుడు అంటూ ఎవరు లేరు మీరే సృష్టించారు మీరే  పూజించారు , మీరే కోరికలు కోరుకుంటున్నారు చివరికి మీరే తిడుతున్నారు. నేనెవరికీ చెప్పుకోవాలి నా ఈ భాదలు  అన్నాడు. 

అందుకే మతం నుండి పుట్టిన దేవుళ్ళు కేవలం మంచిని ఆచరించటానికే తప్ప , కోరికలు తీర్చటానికి పాపాలు కడిగేసుకోవటానికి పనికిరారు.  దేవుడికి మతానికి సంభందం లేదు . దేవుడు అన్న శక్తి నిజం ఐతే జీవి అన్నిటికీ ఒక్కడే దేవుడు. 



రామాయణ భారత భగవద్గీత లు

సంభవామి యుగే యుగే 

రామ బాణం కి తిరుగులేదు అంటారు 
లక్ష్మణ రేఖ దాటకు అంటారు 
సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అంటారు 
చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తే ..చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు హనుమంతుడిలా  అంటారు 
గుంపుగా వస్తే వానర సైన్యం అంటారు 
ఏదైనా తీసుకురావటం కష్టం అంటే, అదేమైనా లంకలో ఉందా అంటారు 


ఎవరైనా జైలుకు వెళితే శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్ళాడంటారు
ఏదైనా సమస్య లో పడితే పద్మవ్యూహం లో పడ్డారంటారు 
ఎవరైనా అడ్డుపడితే సైదవుడిలా అడ్డుపడ్డాడు అంటారు 
మాటతప్పకుంటే భీష్మ ప్రతిజ్ఞ అంటారు 
చిన్న వయసులోనే చనిపోతే అభిమన్యునిలా అర్ధాయుష్షు అంటారు 
గొప్పలు చెబితే  ఉత్తర కుమారుడి ప్రగల్భాలు అంటారు 
మహిళలను వేధిస్తే ....దుర్యోధన దుశ్శాశన కీచకులుగ సంభోదిస్తారు 

భారతీయులు హిందువులు పవిత్రంగా భావించే రామాయణ భారత భగవద్గీత లు మనిషిని  ఎంత ప్రభావితం చేశాయో చెప్పటానికి పైన వ్రాయబడిన కొన్ని ఉదాహరణలు. ఇది ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే విదేశీయులు అంతా అబద్దం అంటూనే అందినకాటికి దోచుకుపోయారు. భారతీయత పై వేల సంవత్సరాల నుండి దాడి జరుగుతూనే ఉంది .... దేవాలయాలు ధ్వంసం చేసారు , పుస్తక జ్ఞానాన్ని నాశనం చేసారు మరియు దొంగలించారు. రాముడు అబద్దం అంటారు రామసేతు మీద పరిశోధనలు చేస్తారు .... కృష్ణుడు కథ అంటారు  ద్వారకా మునిగిపోయింది అని కనుక్కుంటారు .... భారతీయులకు తెలివి లేదంటారు అనంత పద్మనాభ దేవాలయం లోని నాగ బంధం తెరవలేమంటారు. ఇప్పుడు ఓలి(నేపాల్ ప్రధాని ) వొచ్చాడు అయోధ్య మా దేశం లో ఉంది అంటున్నాడు లంక చైనా లో ఉంది అని కూడా అంటాడు. కానీ తరతరాలుగా వివక్ష కు గురయిన వారు అప్పటి అణచివేత కు ప్రతీకారంగా ద్వేషం నింపుకొని విషం చిమ్ముతూ వత్తాసు పలుకుతూ మతం మీద కోపం తో మన గొప్ప పుస్తక, జ్ఞాన సంపదను వినియోగించుకోవటం లో వెనుకబడుతున్నారు  మళ్ళీ మోసపోతున్నారు. 


 కులం 

కులం గురించి మాట్లాడాలంటే హిందూ మతం గురించే మాట్లాడాలి చేసే పనిని బట్టి వివిధ కులాలుగా విభజించారు 

ఓ చిన్న కథ 

ధర్మరాజు ఒకరోజు కృష్ణుడి తో ఇలా అన్నాడు కృష్ణా ధర్మ బద్దుడైన నా ఈ రాజ్యం లో మనుషుల మధ్య ఈ కులాల తారతమ్యాలు ఎందుకు సిరి సంపదలతో అందరిని సమానంగా చూడొచ్చు కదా అని అది విన్న కృష్ణుడు సరే అని తన మాయ తో అందరిని సిరి సంపదలతో సమానంగా చేసాడంట. తరువాతి రోజు ధర్మరాజు లేవగానే తన కింద పనిచేయటానికి ఒక్కరూ లేరంటే , ఇల్లు శుబ్రపరిచే వారు , పశువుల శుబ్రపరిచే వారెవరు లేరు వాసన భరించలేకుండా ఉన్నాడు విషయం అర్థమైంది తన కోరిక ఫలితం అది అని అందరు సమానం కావున పనులు చెయ్యడానికి ఎవరు లేరని . ఏంచెయ్యాలో తొచలేదు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి పరుగు పెట్టాడు కృష్ణుడు నవ్వి మళ్లీ యధాస్థితి కి మార్చాడంట. ఇది నేను విన్న ఒక కథ. 


ఇందులో స్పష్టంగా అర్థం అయ్యేది తమ అవసరాలకోసం, తమకు తాము ప్రశాంతంగా బ్రతకటానికి మనిషి సమాజాన్ని విడగొడతాడు అందులో తెలివైన వాడు గెలుస్తాడు ఇతరులని వాడుకొంటాడు అందులో నుంచి పుట్టిందే కుల, వర్ణ వర్గీకరణ, అంటరానితనం, ప్రపంచం మొత్తం ఉండే జాతి వివక్ష. 


దళితుడే అసలైన రాజు


మానవ మనుగడ సాగించటం మొదలు పెట్టిన తరువాత తనను తానూ కాపాడుకోవటానికి  ప్రకృతిని తనకు అనుకూలంగా వినియోగించుకుంటూ ఒక్కొక్క మెట్ట్టు ఎదుగుతూ వచ్చాడు ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. రాతి కాలం లో మృగంగా బ్రతికినప్పటి నుంచి జీవపరిణామ క్రమంలో మెదడుకి పని పెడుతూ  ప్రక్రుతి నుంచి కాపాడుకోవటానికి ప్రక్రుతి ని వినియోగించుకుంటూ  అదే ప్రక్రుతి లోని జీవరాసులకన్నిటికి నాయకుడి గ ఎదిగాడు ప్రక్రుతి నే నడిపిస్తున్నాడు. సులభ తరమైన జీవనం కోసం నిప్పు, చక్రం ,  ఆయుధం, కూడు , గూడు, గుడ్డ, వైద్యం లను సొంత తెలివితో అభివృద్ధి చేసుకున్నాడు, పర్యవసానంగా మానవ మనుగడ అసాధారణ రీతిలో శాసించే స్థాయి కి చేరింది ఇక్కడే బ్రతకటం చాలు అనే నుంచి ఆధిపత్యం అనే గమనం మార్చుకుంది. జీవరాశులన్నిటి నుండి మనిషి వేరు పడి నాయకుడి గ ఎలా ఎదిగాడో అలాగే మనిషి మనిషి లో నాయకుడు పుట్టటం మొదలైంది. ప్రక్రుతి లో మనిషి తో సమానమైన  జంతువులను , పక్షులను ఎలా అయితే తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడో , మనిషి మరో మనిషి ని తన చెప్పుచేతుల్లో పెట్టుకోవాలనే స్వార్థం లో నుంచి తెలివి, బలం ప్రధాన ఆయుధాలు అయ్యాయి. భూ ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి మన దేశ విధానాలకు వస్తే ఆధిపత్యంలో నుంచి వివిధ వర్గాలుగా విభజించి రాచరికంతో అధిక సంఖ్యాకులను అల్ప సంఖ్యాకులు పరిపాలించటం మొదలైంది. ఇందులో ముఖ్యంగా దళితులను అంటరాని వారిగా విభజించి అత్యంత హేయంగా  పనివాళ్ళలా , కూలీలు గ, బానిసలు గ , పదుల కాదు వందల కాదు వేల సంవత్సరాలు మనిషి గా కూడా గుర్తించడానికి ఇష్టపడలేదు.పనికి దగ్గర గా, ఓపిక ఆభరణంగా,  ఊరికి దూరంగా , గుడి కి బహుదూరంగా  పాక లో బహుజనుడి గ జీవించిన దళితుడే అసలైన రాజు  అటువంటి రాజును చెట్టుకు కట్టేసి కొట్టిన రోజులెన్నో. అగ్రకులహంకారుల దుర్యోధనుని మూకుమ్మడి  దాడిలో అర్థాంతరంగ తనువు చాలించిన అభిమన్యుడు దళితుడు. బానిసత్వం అంటే ఎంత నరకమో తెలియచెప్పటానికే వచ్చారు అన్నట్లు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిషర్ల పై తిరుగుబాటు చేసి గెలిచారు.  బానిసత్వం బాధ తెలిసినా భారతీయులు తమ తోటి భారతీయుల్ని ఇంకా బానిసలు గానే  చూస్తున్నారు ఆధిపత్యం పోతుందని కులం తోకను కత్తరించ లేకున్నారు ఇక్కడ కుల వివక్ష గ పిలిస్తే  పనికిమాలిన ప్రపంచంలో జాత్యహంకారం గా పిలవబడుతోంది పేరు మాత్రమే తేడా.   

 25 years enough for me to know the stupid world.

రుమాలు కిరీటమై 
చెమట సుగంధమై 
ఒంటికి అంటిన మట్టి దుస్తులై 
పనితనమే ఆయుధమై 
చిరు నవ్వే రాజసమై 
ఊరి బయట కాపలాదారుడై 
రాజ్యాలను నడిపిస్తున్న 
దళితుడే అసలైన రాజు. 
నిన్ను పరిపాలించేది రాజులు కాదు 
యమరాజులు, కాపలా దారులు.
కమ్మరి కుమ్మరి వడ్రంగి వేనా 
అన్నేన, అన్నీ అయిన
దళితుడే అసలైన రాజు. 
సహనంలో 
అణకువలో 
భరించటంలో 
నిన్ను భరించటంలో 
బాధను భరించటంలో 
భరత దేశపు సింహాసనాన్ని మోస్తున్న 
దళితుడే అసలైన రాజు
మిగిలిన భోజనం వృధా కానివ్వని,
చీకట్లో, కటిక చీకట్లో నివాసముండే 
భూమిని శుబ్రపరిచే
దళితుడే అసలైన రాజు భూమికి.

అంటరానితనం / మతమార్పిడులు 

ఇందులో అనుమమానం ఏమి లేదు హిందూ మతం లో ని కుల వర్ణ వివక్ష తో విసిగిపోయిన దళితులు బానిసత్వం నుంచి బయట పడటానికే మతం మారుతున్నారు, వేళ సంవత్సరాలుగా అంటరాని తనానికి గురై అగ్ర కుల కబంధహస్థలాల్లో నలిగిపోయారు. కానీ మహనీయుడు అంబేద్కర్ పోరాటంతో తరతరాల అన్యాయానికి ప్రతిఫలంగా దళితులకు రిజర్వేషన్స్ వలన కొంత మంచి జరుగుతోంది. భారతీయులు బ్రిటిషర్లు తో పోరాడి స్వాతంత్య్రాన్ని సాధించారు అలాగే దళితులు కుల నిర్మూలన, సమానత్వం కోసం పోరాడాలి అంతే గాని మతం మారటం అన్నది పెనం మీద నుంచి పొయ్యిలో పడటమే. అంటరానితనం అనే బలహీనతను వాడుకొని నీలోకి ప్రవేశిస్తున్న మతం అనే గాలానికి చిక్కకుండా స్వతంత్రంగా ఆలోచించు.  జాతి వివక్ష ప్రపంచం మొత్తం ఉంది అలాగే ఉంటుంది కేవలం రూపం మార్చుకుంటుంది.  అందుకే నెల్సన్ మండేలా , గాంధీ , అంబేద్కర్  లు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండాలి వారి అవసరం ఎప్పడు ఉంటుంది. 

వినాశనం 

మనిషి బ్రతుకే ఆధిపత్యం కోసం అయినప్పుడు మంచి చెడు ప్రస్తావన వాళ్లకు అనవసరం 

మొదటి స్థాయి లో 

మనిషి ప్రక్రుతి ని వాడుకోవటం మొదలు పెట్టి  ఆ తరువాత చంపటం చేసాడు 

రెండవ స్థాయి లో 

మనిషి జంతువులను పక్షులను  ని వాడుకోవటం మొదలు పెట్టి  ఆ తరువాత చంపటం చేసాడు 

మూడవ స్థాయి లో 

మనిషి మనిషిని వాడుకోవటం మొదలు పెట్టి  ఆ తరువాత ?? 

ఆయుధాల నుంచి అణుబాంబుల వరకు తయారుచేస్తుంది వినాశనం కొరకే ముందే చెప్పుకున్నట్లు అవసరాలని బట్టి శాంతియుతంగా ఉండొచ్చు కానీ శాంతి స్థాపన అసాధ్యం. 

అందుకే యుద్ధం అనేది జీవితంలో రావటం తప్పని సరి అది ఎంత దూరంలో ఉంది అన్నదే ప్రశ్న 

ఈ సృష్టి ని సృష్టించిన దేవుడు ఎవరో కానీ ఈ సృష్టిని నాశనం చేసే దేవుడు మాత్రం మనిషే .... 

తిరుగుబాటు 

భయం , బాధ , నొప్పి , కోపం , ఆశ  నుంచే తిరుగుబాటు మొదలవుతుంది . రాచరికం, భూస్వామ్యవాదుల నుంచి బానిసత్వం విముక్తి కై తిరుగుబాటు మొదలైంది 

డబ్బు విలువైనాదే కానీ



ఒక క్రైమ్ స్టోరీ 
అమ్మ నాన్న, నా అనే ఎవరూ లేని క్రూరమైన ఒక హంతకుడు చాలా హత్యలు చేసి మరిన్ని హత్యలు చేయటానికి ఓ పథకం ప్రకారం మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి మరో కొత్త పట్టణంలోకి ప్రవేశించాడు పథకంలో భాగంగా మూడొందల రూపాయలు పెట్టి ఒక బాట్ కొని  .. సరైన సమయం కోసం  బస్టాండ్ ఆవరణ లో ఎదురు చూస్తూ ఉండగా ..వచ్చీ రాగానే బాట్ తో బలంగా బాదాడు దెబ్బ గట్టిగ తగలడంతో గిల గిల తిరుగుతూ కింద పడ్డ కానీ ...ఏ మాత్రం దయ జాలి లేని ఆ రాక్షసుడు కాలితో తొక్కి తొక్కి ప్రాణం తీసాడు ... ఆలా లెక్కలేనన్ని దోమల్ని చంపుతున్న ఆ హంతకుడు ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా తిరుగుతూనే ఉన్నాడు 

ఈ కాలంలో కూడా ఇంకా ఇంజనీర్ డాక్టర్ ఏంటిరా .... 
ఇంటికో ఇంజనీర్ వీధికో డాక్టర్ ఉన్నారు ...
ఏ ఫిలిం స్టారో క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ప్రయత్నించండి .. 
కనీసం వాళ్లకు సపోర్ట్ చెయ్యండి. 



నేను టాక్స్ ఎందుకు కట్టాలి? why i'm paying TAX?






------------Purush